అమరావతి: ఏపీ విభజన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయని భావించారు. కానీ అలా జరగడంలేదు. గత ప్రభుత్వంలో కాస్త పర్వాలేదనిపించినా జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులు ఆంధ్రవైపే చూడటంలేదు. మరోవైపు ఉన్న కంపెనీలు కూడా వరుసగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. తాజాగా అమర్‌రాజా కంపెనీ ఏపీకి గుడ్ బై చెప్పేలా కనిపిస్తోంది. ఇటీవలకాలంలో ప్రభుత్వం అమరరాజా బ్యాటరీస్ కు చెందిన భూముల ఒప్పందాలను రద్దు చేసింది. దీంతో కంపెనీ నిర్వాహకులు కోర్టుకు ఆశ్రయించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కోర్టు వేసింది. దాంతో కంపెనీకి ఊరట లభించిందనుకునేలోపే.. పీసీబీ షాక్ ఇచ్చింది. కంపెనీ పర్యావరణ అనుమతులపై నోటీసులు జారీ చేసింది. దీంతో పీసీబీకి అమరరాజా బ్యాటరీస్ వివరణ ఇచ్చింది.
రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అమరరాజా నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అమరరాజా బ్యాటరీస్‌ను తమిళనాడులో పెట్టుకోవాలని భావించారు. ఈ మేరకు అటువైపు ప్రయత్నాలు చేశారు.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అమరరరాజా బ్యాటరీస్ నిర్వహాకులు కలిశారు. అమరరాజా బ్యాటరీస్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. వెంటనే తమిళనాడు ప్రభుత్వం అమరరాజాకు భూమి కూడా కేటాయించింది. దీంతో అక్కడ పనులు కూడా ప్రారంభించారు. మరో మూడు నెలల్లో అమరారాజా బ్యాటరీస్ తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా ఈ కంపెనీ ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ కంపెనీ ప్రతి ఏడాది ట్యాక్సుల రూపంలో ఏపీ ప్రభుత్వానికి రూ. 2400 కోట్లు చెల్లిస్తోంది. ఇందులో ఏపీ రూ.1200 వాటాగా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ తరలిపోవడంతో కార్మికులకు ఉపాధి పోవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పోతుందని విశ్లేషుకులు అంటున్నారు.