అదిరిపోయే ఆఫర్‌ కేవలం రూ.9 కే గ్యాస్‌ సిలిండర్‌!

Join Our Community
follow manalokam on social media

మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందా? అయితే మీకు ఓ శుభవార్త. సిలిండర్‌ ఖాళీ అయితే శుభవార్త ఏంటా? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఇప్పుడు గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే అతి తక్కువ ధరలోనే గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చు. ఈ అదిరిపోయే ఆఫర్‌లో కేవలం రూ.9కే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం లభించనుంది. గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.800 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అయితే ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ రూ.10 నుంచే వస్తుంది. ఆఫర్‌ కొన్ని రోజులు మాత్రమే వస్తుంది. అంటే ప్రస్తుతం గ్యాస్‌ బుక్‌ చేసుకునే వారి పంట పండినట్లే. ఈ అద్భుతమైన ఆఫర్‌ ద్వారా భారీ తగ్గింపు మీ సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు, ఈ ఆఫర్‌ను మీరు ఇంట్లో నుంచే పొందవచ్చు. ఈవాలెట్‌ సంస్థ పేటీఎం వినియోగదారులకు ఈ అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తన ప్లాట్‌ఫాం ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే ఈ క్యాష్‌బ్యాక్‌ అవకాశం లభిస్తుంది.

పేటీఎం ద్వారా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకుని రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఒకవేళా గ్యాస్‌ సిలిండర్‌ రూ.800 ఉంటే, మీరు గ్యాస్‌ బుక్‌ చేసుకున్నప్పుడు రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. కానీ, ఈ ఆఫర్‌ కేవలం ఈ నెల వరకే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ కేవలం పేటీఎం ద్వారా గ్యాస్‌ చేసుకుంటేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.
అయితే, ఈ ఆఫర్‌లో మీరు రూ.10 నుంచి రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. అంటే రూ.800 లోపు ఎంతైనా క్యాష్‌బ్యాక్‌ రావచ్చు. తక్కువలో తక్కువ రూ.10 నుంచి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ డబ్బులు కేవలం 24 గంటల్లోనే క్యాష్‌బ్యాక్‌ మీ ఖాతాలో వచ్చి చేరుతుంది.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...