గుడ్ న్యూస్: పండుగ ముందు SBI తీసుకున్న నిర్ణయం…!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే… ఫిక్స్‌డ్ డిపాజిట్ FD రేట్లు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీని మూలంగా బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి బెనిఫిట్ కలుగుతుంది. స్టేట్ బ్యాంక్ రూ.2 కోట్లకు లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. ఇది ఇలా ఉంటే ఈ నెల నుంచే రేట్ల సవరణ నిర్ణయం అమలు లోకి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది.

ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాల పరిమితి లోని ఎఫ్‌డీల పై బ్యాంక్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం కొత్త ఎఫ్‌డీ రేట్లను వర్తిస్తుంది. అలానే రెన్యూవల్ చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కూడా ఇది వర్తిస్తుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. స్టేట్ బ్యాంక్ 2020 సెప్టెంబర్ 10న ఫిక్స్‌డ్ డిపాజిట్లను సవరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సవరించిన తర్వాత రేట్లు ఎలా పెరిగాయి అనే విషయానికి వస్తే… 7 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితి లోని ఎఫ్‌డీల పై వడ్డీ రేటు 2.9 శాతం ఉండగా….. 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై 3.9 శాతం వడ్డీ రానుంది.

అదే 180 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్‌డీల పై 4.4 శాతం వడ్డీ వస్తున్నట్టు చెప్పారు. ఇక ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజట్ల పై అయితే 5 శాతం వడ్డీ లభిస్తుంది. అదే రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లని చేస్తే 5.1 శాతం వడ్డీని పొందొచ్చు. మీరు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై 5.3 శాతం వడ్డీ వస్తుంది. 5.4 శాతం వడ్డీ రేటును పొందాలంటే 5 ఏళ్ల నుంచి పదేళ్లలోపు అయ్యి ఉండాలి. అదే సీనియర్ సిటిజన్స్ కి అయితే అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ లభిస్తుంది.