సైబర్‌ క్రైమ్‌ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి

-

ఈరోజుల్లో సైబర్‌ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటి గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు మోసపోతున్నారు. ముఖ్యంగా భారత్‌లో రోజుకో కేసు నమోదవుతోంది. రెండు రోజుల క్రితం ఓ సైబర్ మోసగాడు ఓ మహిళకు ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించేందుకు సహాయం చేస్తానని చెప్పి రూ.1.37 లక్షలు దోపిడీ చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఓటీపీ మోసాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించడానికి, డబ్బు తిరిగి పొందడానికి బెంగుళూరు పోలీసలు గోల్డెన్‌ అవర్‌ అనే సుదుపాయాన్ని తీసుకొచ్చారు. ఇదేంటి..దీని ద్వారా డబ్బు ఎలా వస్తుందంటే..

బెంగుళూరు పోలీసులు ప్రవేశపెట్టిన గోల్డెన్ అవర్ అనే సదుపాయాన్ని ఉపయోగించుకుంటే సైబర్ మోసగాళ్ల నెట్ వర్క్ నుంచి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందవచ్చు. ఈ గోల్డెన్ అవర్ సదుపాయాన్ని ఇప్పటికే వేలాది మంది ఉపయోగించుకున్నారు. సైబర్ మోసం నుండి కోల్పోయిన డబ్బును తిరిగి పొందారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో, ఆన్‌లైన్ మోసం వంటి సైబర్ నేరాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగా గోల్డెన్ అవర్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.

మీరు సైబర్‌ క్రైమ్‌ ద్వారా డబ్బు పోగొట్టుకుంటే.. గంటలోపు పోలీసు కంట్రోల్ రూమ్ 1930కి కాల్ చేసి పోలీస్ కంట్రోల్ రూం సిబ్బంది డబ్బులు పోగొట్టుకున్న పూర్తి వివరాలను తెలియజేయాలి. ఇక్కడ వారు మీ సమాచారం ఆధారంగా మీ బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేస్తారు. ఇది మీ ఖాతా నుండి మరెవ్వరూ డబ్బును విత్‌డ్రా చేయకుండా నిరోధిస్తుంది.

www.cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

మీరు RBI యొక్క టోల్ ఫ్రీ నంబర్ 114448కి కూడా కాల్ చేయవచ్చు. https://cms.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

మీరు UPI ద్వారా అంటే Google Pay, Phone Pay మొదలైన వాటి ద్వారా డబ్బు పోగొట్టుకుంటే, ఆ సంస్థకు ఫిర్యాదు చేయండి, లేకపోతే కాల్ చేసి విషయం గురించి చెప్పండి. ఈ సందర్భంలో వారు అడిగిన అన్ని పత్రాలు, స్క్రీన్‌షాట్‌లను వారికి పంపండి. మీరు బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బు పోగొట్టుకుంటే, వెంటనే కంపెనీని సంప్రదించి, వారికి తెలియజేయండి, అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత మీరు మీ డబ్బును తిరిగి పొందుతారు. ఇదంతా జరగడానికి కాస్త టైమ్‌ పడుతుంది. కానీ పోగుట్టుకున్న డబ్బు కచ్చితంగా వెనక్కు వస్తుందని అధికారులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news