క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు ఏవైనా సరే.. పోయాయంటే మనం కచ్చితంగా ఆందోళనకు గురవుతాం. ఆ కార్డులు దొరికిన ఎవరైనా వాటితో ఏటీఎంలలో డబ్బులు తీస్తే అప్పుడు మనం భారీగానే నష్టపోవాల్సి వస్తుంది. అయితే అంత వరకు రాకముందే మనం కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ డెబిట్ కార్డును గనక ఎవరైనా పోగొట్టుకుంటే.. కార్డ్‌ను ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోతే ముందుగా www.onlinesbi.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో తమ ఎస్‌బీఐ యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌లను ఎంటర్ చేసి సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
2. సైట్‌లో e-Services అనే విభాగంలో ఉన్న Block ATM Card అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. అక్కడే మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డులు చూపించబడతాయి. వాటిల్లోంచి ఏ డెబిట్ కార్డును అయితే బ్లాక్ చేయదలచుకున్నారో దాన్ని ఎంచుకోవాలి.
4. మీరు బ్లాక్ చేయదలచుకున్న కార్డును ఎంచుకుని అనంతరం సబ్‌మిట్ నొక్కాలి.
5. కన్ఫర్మేషన్ కోసం ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీని ఎంటర్ చేయాలి.
6. అంతే.. క్షణాల్లో మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది. మీకు ఓ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని తదుపరి విచారణల నిమిత్తం భద్రంగా ఉంచుకోవాలి.
కార్డు బ్లాక్ అయ్యాక మీ దగ్గరలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్ లేదా ఆన్‌లైన్ లోనే కొత్త కార్డుకు సులభంగా అప్లై చేయవచ్చు.