ఎక్కడి వాలెంటైన్స్ డే… మన కల్చరా అది. హిందూ సంస్కృతిలో దీనికి చోటు లేదు. వాలెంటైన్స్ డే రోజున చెట్టాపట్టాలేసుకుని చెట్లవెంట పుట్టలవెంట… పార్కుల వెంట తిరిగితే మాత్రం అడ్డంగా బుక్కై పోతారు అంటూ భజరంగ్ దళ్ సభ్యులు, వీహెచ్పీ సభ్యులు హెచ్చరిస్తున్నా ప్రేమ జంటలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
తాజాగా మేడ్చల్ లో ఉన్న ఆక్సిజన్ పార్క్ లో ఓ ప్రేమ జంట కనిపించింది భజరంగ్ దళ్ సభ్యులకు. ఇక ఊరుకుంటారా వాళ్ళు.. ఆ జంటను పట్టుకొని అక్కడికక్కడే పెళ్లి చేసేశారు. అంతే కాదు ఆ తతంగాన్ని వీడియో కూడా తీశారు. దీంతో ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు వీడియో ఆధారంగా భజరంగ్ దళ్ సభ్యులను పట్టుకున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ, వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.