ఢిల్లీ: రేపు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని యథాతథంగా కృష్ణా రివర్ బోర్డు బృందం తనిఖీలు జరపనుంది. కృష్ణా రివర్ బోర్డు బృందానికి చెందిన సిడబ్ల్యుసిలో పనిచేస్తున్న తెలంగాణ అధికారిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఈ పిటిషన్‌పై ఇవాళ “నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్” విచారణ జరిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తనిఖీలలో.. తెలంగాణకు చెందిన అధికారి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్ లో పేర్కొంది.
సీడబ్లూసీలో పనిచేస్తున్న దేవేందర్‌రావును తనిఖీ బృందంలో చేర్చడంపై..అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఏపీ అభ్యంతరంపై కృష్ణా బోర్డును వివరణ కోరింది ఎన్జీటీ. తెలుగు రాష్ర్టాల వ్యక్తులు లేకుండా తనిఖీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది కృష్ణా రివర్ బోర్డు. బోర్డు వాదనను పరిగణనలోకి తీసుకుని ఈనెల 9న నివేదిక అందజేయాలని కృష్ణాబోర్డును ఆదేశించింది జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్ పర్ట్ మెంబర్ డాక్టర్ సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటీ చెన్నై బెంచ్.