మీ పాన్ కార్డులో ఫోటోని మార్చుకోవాలంటే ఇలా చెయ్యండి..!

-

మనకి వుండే డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు చాలా ముఖ్యమైనది. ఎన్నో వాటికీ ప్రూఫ్ గా పాన్ కార్డు పని చేస్తుంది. అలానే ఎక్కువ లావాదేవీలు జరిపేవారికి పాన్ కార్డ్ తప్పనిసరి. 18 ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును సబ్మిట్ చెయ్యాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంది.

అయితే మీ పాన్ కార్డులో వున్నా ఫోటో మీకు నచ్చలేదా..? దానిని మీరు మార్చాలని అనుకుంటున్నారా..? అయితే అది ఎలానో ఇప్పుడు చూడండి. దీనితో మీరు ఈజీగా మీ పాన్ లో ఫోటోని మార్చచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇదేం పెద్ద కష్టం ఏమి కాదు. ఎంతో ఈజీగా ఫోటో అప్‌డేట్ చేయొచ్చు. అలానే సంతకం కూడా మార్చొచ్చు. అది ఎలా అనేది చూసేద్దాం.

దీని కోసం ముందుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ఆన్‌లైన్ సర్వీసెస్ వెబ్‌సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ఓపెన్ చేయాలి.
ఇప్పుడు అప్లికేషన్ టైప్‌లో Changes or corrections in the existing PAN Data సెలెక్ట్ చేయాలి.
ఇక్కడ ఇండివిజ్యువల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి.
నెక్స్ట్ మీరు పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసాక…కేవైసీ ఆప్షన్ ఎంచుకోండి.
ఫోటో మార్చాలనుకుంటే Photo Mismatch ని సెలెక్ట్ చేయాలి
ఇప్పుడు వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి.
ఒకవేళ సంతకం కూడా మరచాలంటే Signature Mismatch సెలెక్ట్ చేసి పైన వున్నా ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి.
మీ అడ్రస్ ఇండియాలో ఉంటే రూ.101, విదేశాల్లో ఉంటే రూ.1011 ఛార్జీలు చెల్లించాలి.
ఫైనల్ గా ట్రాన్సాక్షన్ పూర్తైన తర్వాత 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది అంతే మీరు స్టేటస్ చేసుకోచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news