మైక్రో కెమేరా ఉందని అనుమానమా? ఇలా గుర్తుపట్టండి!

-

మైక్రో కెమేరాలు. యువతులు, మహిళల పట్ల శాపంగా మారాయి. షాపింగ్ మాల్స్, హోటళ్లకు వెళ్లినప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. దుస్తులు మార్చుకోవాలంటే ఏదో ఆందోళన. ఎక్కడ వీడియో చిత్రీకరణ అవుతుందోననే టెన్షన్. ఏ ఆకతాయి తమ పరువును తీస్తారో తెలియని పరిస్థితి. అయితే, అప్రమత్తత ద్వారా ఆకతాయిల ఆట కట్టించవచ్చు. సులువుగా మైక్రో కెమేరాలను గుర్తించవచ్చు. అదేలా ఓసారి చదవండి.

– చీకటి‌లో మైక్రో కెమేరాలను సులువుగా గుర్తించవచ్చు. అందుకే, షాపింగ్ మాళ్లు, హోటళ్లలో క్లాత్స్ మార్చుకొనే సమయంలో లైట్లను ఆపేయండి. ఎక్కడైనా మైక్రో కెమేరాలు అమర్చి ఉంటే వెలుగుతూ ఆరుతూ ఉంటాయి కాబట్టి సులువుగా గుర్తించవచ్చు.

– మైక్రో కెమేరాలను సులువుగా ఎక్కడపడితే అక్కడ అమర్చవచ్చు. డోర్‌లాక్‌లు, లాక్స్, బీరువాలు, లైట్లు, గోడ గడియారాల్లో మైక్రో కెమేరాల్లో సులువు అమర్చే అవకాశం ఉంది. వాటిని తీక్షణంగా పరీక్షిస్తే సులువుగా గుర్తు పట్టవచ్చు.

– చీకటిలో కూడా ఇన్‌ఫ్రారెడ్ కెమేరాలు పనిచేస్తాయి. వీటిని సీలింగ్, గోడలు, ట్రయల్‌రూంలోని షీట్లపై అమర్చే అవకాశం ఉంటుంది. మచ్చల రూపంలో ఏదైనా కనిపిస్తే స్మార్ట్‌ఫోన్ కెమేరా ద్వారా జూమ్ చేసి వాటిని గుర్తించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news