పీఎఫ్ ఖాతాదారులు అకౌంట్ లో డబ్బులని ఇలా చెక్ చేసుకోండి..!

-

మీరు పీఎఫ్ ఖాతాదారుల..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO ఒక గుడ్ న్యూస్ ని తమ ఖాతాదారులకు అందించింది. అదేమిటంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5 శాతం పీఎఫ్ వడ్డీ డబ్బులను తమ ఖాతాదారుల అకౌంట్ లో వేయడం మొదలు అయ్యినట్టు తెలిపింది.

epf

 

ఇది నిజంగా వారికీ గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఏకంగా 6.5 కోట్ల మంది పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు రిలీఫ్ కలిగింది అనే చెప్పాలి. ఒకవేళ కనుక మీ అకౌంట్ లో ఇంకా డబ్బులు పడలేదు అంటే కంగారు పడద్దు. వీటిని మాములుగా జోన్ల వారీగా క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఒకేసారి రావు. కొందరికి ముందు పడితే మరి కొంత మందికి ఆ డబ్బులు ఆలస్యంగా వచ్చే అవకాశం వుంది.

ఇది ఇలా ఉంటే మీ అకౌంట్ లో ఆ డబ్బు పడిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు వచ్చాయా లేదా అనేది ఒక్క మిస్డ్ కాల్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు. 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. లేదు అంటే ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి కానీ ఉమాంగ్ యాప్ ద్వారా ఈ సందేహాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news