ఐడియా బంపర్ ఆఫర్.. 159 రూపాయలకే 28 జీబీ డేటా!

-

జియో ఓ సంచలనం. నెట్‌వర్క్ రంగంలోనే పెను తుపానులా విరుచుకుపడింది జియో. దాని దెబ్బకు మిగితా నెట్‌వర్కులన్నీ కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే మిగితా నెట్‌వర్కులు కూడా కోలుకుంటున్నాయి. జియో దెబ్బకు అబ్బ అంటూ నడ్డివిరగ్గొట్టుకున్న ఐడియా, వొడాఫోన్.. ఇక లాభం లేదనుకొని కలిసిపోయాయి. ఒంటరి పోరాటం కాదు.. కలిసి పోరాడుదామని కంకణం కట్టుకున్నాయి. దానిలో భాగంగానే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ నుంచి ఈ బంపర్ ఆఫర్ వచ్చింది. రెండింట్లో ఏ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నవాళ్లయినా ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. 159 రూపాయలు పెట్టి రీచార్జ్ చేయించుకుంటే… 28 రోజుల వాలిడిటీతో 28 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను వినియోగించుకోవచ్చు. జియోలో ఇటువంటిదే రూ.149 ఆఫర్ ఉంది. 149 రూపాయలతో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 1.5 జీబీ డెయిలీ డేటా లభిస్తుంది. కాకపోతే.. ఐడియా ప్లాన్ ప్రకారం.. ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news