బాలీవుడ్ ప్రేమ జంట రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునేలు ఈ నెల 15న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటలీలో వీరి పెళ్లి జరుగనుంది కేవలం 200 మంది మాత్రమే వీరి పెళ్లికి అటెండ్ అవనున్నారు. ఇప్పటికే దీపిక ఇంట పెళ్లి సందడి మొదలైందని తెలుస్తుంది. ఈ నెల 13న సంగీత్ ఏర్పాటు చేయగా ఆ తర్వాత 3 రోజులు పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. పెళ్లి తర్వాత ముంబై గ్రాండ్ హయత్ హోటెల్ లో రిసెప్షన్ ప్లాన్ చేశారట.
పెళ్లికి 200 మంది గెస్టులకే ఆహ్వానం పంపగా రిసెప్షన్ కు మాత్రం బాలీవుడ్ అంతా కదిలి వచ్చేలా ప్రోగ్రాం ఫిక్స్ చేశారని తెలుస్తుంది. దీపిక ఇంట పెళ్లి సందడిని దీపిక స్టైలిస్ట్ షలీనా నటానీ ఇన్ స్టాగ్రాం లో కొన్ని ఫోటోలు పెట్టింది. దీపిక అండ్ ఫ్యామిలీ పెళ్లి వేడుకల్లో తనమునకలైవగా ఆ పిక్స్ ను షేర్ చేసింది. ఇటలీ లేక్ కోమా వేదికగా రణ్ వీర్, దీపికల పెళ్లి జరుగనుంది. బాలీవుడ్ హాట్ లవ్ కపుల్ అయిన రణ్ వీర్, దీపికలు పెళ్లితో ఒకటవడం ఇరువురి ఫ్యాన్స్ కు సంతోషంలో ముంచెత్తేలా చేస్తుంది.