లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ డబ్బులు ఎవరు చెల్లించాలి..?

కొన్ని కొన్ని సార్లు అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా బ్యాంకుల నుండి లోన్ ని చాల మంది తీసుకుంటూ వుంటారు. దీని వలన వాళ్లకి ఆర్ధికంగా ఇబ్బంది ఉంటే తొలగి పోతుంది. తీసుకున్న లోన్ ని నెమ్మదిగా వాళ్ళు చెల్లిస్తూ వుంటారు.

అయితే ఈ లోన్స్ లో రకాలు కూడా ఉంటాయి. హౌసింగ్ లోన్స్, వెహికిల్ లోన్స్, పెర్సనల్ లోన్స్ మొదలైనవి. వీటిని ఎవరైనా తీసుకోవచ్చు. వీటి వలన ఆర్ధికంగా ఇబ్బందిలు ఎక్కువగా ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చు.

అదే విధంగా తనఖా లేని రుణాలు చాలా మంది తీసుకుంటారు. వాటినే పర్సనల్ లోన్స్ అని అంటారు. కొన్ని వాటికి అయితే ఏదైనా తనఖా పెట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. వీటిని సెక్యూర్డ్ రుణాలు అని పిలుస్తారు. ఇలా లోన్స్ లో చాల వున్నాయి.

ఈరోజు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏం అవుతుంది అనేది చూద్దాం. పర్సనల్ లోన్స్ వంటి అన్‌సెక్యూర్డ్ లోన్ తీసుకుని వ్యక్తి మరణిస్తే.. కుటుంబ సభ్యులను లోన్ డబ్బులు కట్టమని బ్యాంక్ అడగకూడదు. సెక్యూర్డ్ లోన్స్ లో కూడా అంతే.

లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఇంట్లో వాళ్ళని కట్టమని అడగవు. ఇక్కడ తనఖా పెట్టిన ప్రాపర్టీ లేదా ఇతర వస్తువులను బ్యాంకులు విక్రయించుకుంటాయి. అదే జాయింట్ లోన్ తీసుకుంటే ఇంకొకరు కచ్చితంగా రుణ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.