ట్రెయిన్ టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉందా..? మ‌రేం ఫ‌ర్లేదు.. వేరే ట్రైన్‌లోనూ వెళ్ల‌వ‌చ్చు తెలుసా..?

-

ఐఆర్‌సీటీసీ ట్రైన్ జ‌ర్నీ చేసేవారికి విక‌ల్ప్ స్కీం కింద ఓ ప్ర‌త్యేక‌మైన స‌దుపాయాన్ని ఇండియ‌న్ రైల్వేస్ అందిస్తోంది. ఈ క్ర‌మంలో రైల్వే టిక్కెట్ రిజ‌ర్వేష‌న్ కన్ఫాం కాక‌పోతే అదే టైముకు అదే రూట్లో వెళ్లే మ‌రో ట్రెయిన్‌లో ప్ర‌యాణికులు వెళ్ల‌వ‌చ్చు.

సాధార‌ణ రోజుల్లోనే రైళ్ల‌లో రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటే వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాల్సి వ‌స్తుంది. దీంతో టిక్కెట్ ఎప్పుడు క‌న్ఫాం అవుతుందో, అస‌లు క‌న్ఫాం అవుతుందో, లేదోన‌ని చాలా మంది ఆందోళ‌న చెందుతుంటారు. అందుక‌నే కొందరు త‌త్కాల్ టిక్కెట్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. కానీ వాటికి కూడా ఫుల్ కాంపిటీష‌న్ ఉంటుంది. దీంతో చాలా మంది టిక్కెట్లు కొనుగోలు చేసి కూడా రిజర్వేష‌న్ క‌న్ఫాం కాక విచారం వ్యక్తం చేస్తుంటారు. అయితే అలాంటి బాధ‌లు ఇక‌పై త‌ప్ప‌నున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే..

రైల్వే ప్ర‌యాణికుల‌కు భార‌తీయ రైల్వే శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై ఐఆర్‌సీటీసీ ట్రైన్ జ‌ర్నీ చేసేవారికి విక‌ల్ప్ స్కీం కింద ఓ ప్ర‌త్యేక‌మైన స‌దుపాయాన్ని ఇండియ‌న్ రైల్వేస్ అందిస్తోంది. ఈ క్ర‌మంలో రైల్వే టిక్కెట్ రిజ‌ర్వేష‌న్ కన్ఫాం కాక‌పోతే అదే టైముకు అదే రూట్లో వెళ్లే మ‌రో ట్రెయిన్‌లో ప్ర‌యాణికులు వెళ్ల‌వ‌చ్చు. కాగా ఈ విక‌ల్ప్ స్కీం అన్ని త‌ర‌గ‌తుల్లో ప్ర‌యాణించే వారికి వ‌ర్తిస్తుంది. అలాగే స్లీపర్‌, ఏసీ త‌ర‌గతులకు చెందిన టిక్కెట్ల‌ను బుక్ చేసుకున్న వారు కూడా ఈ స్కీంను ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే ఏ త‌ర‌గ‌తికి చెందిన టిక్కెట్ అయినా స‌రే.. అది వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే మాత్ర‌మే ఈ స్కీంను ఉప‌యోగించుకునేందుకు వీలుంటుంది.

విక‌ల్ప్ స్కీంలో భాగంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్ర‌యాణికులు గ‌రిష్టంగా 7 రైళ్ల‌లో ప్ర‌త్యామ్నాయంగా ప్రయాణించ‌వచ్చు. ప్ర‌యాణికులు తాము బుక్ చేసుకున్న టిక్కెట్ క‌న్ఫాం కాకుండా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే.. 7 ప్ర‌త్యామ్నాయ రైళ్లలో ఏదైనా ఖాళీగా ఉన్న బెర్త్‌ను ఎంచుకుంటే అది క‌న్ఫార్మ్ అవుతుంది. దీంతో ముందుగా బుక్ చేసుకున్న ట్రైయిన్ లో కాకుండా క‌న్ఫాం అయిన ట్రెయిన్‌లో ప్ర‌యాణికులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒక వేళ ప్ర‌య‌త్నామ్నాయంగా ఉండే 7 రైళ్ల‌లోనూ బెర్త్ లు క‌న్ఫాం కాక‌పోతే అప్పుడు ఆ టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటుంది. ఇక టిక్కెట్ ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌న్ఫాం కాదు. అయితే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్ క‌న్ఫాం అయితే ప్ర‌యాణికులు వెళ్ల‌బోయే ట్రెయిన్ మారుతుంద‌ని తెలుసుకోవాలి. ఇలా విక‌ల్ప్ స్కీంతో రైల్వే ప్ర‌యాణికులు ల‌బ్ది పొంద‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news