నువ్వు గ్రేట్ బాస్‌.. జొమాటో డెలివ‌రీ బాయ్‌కి నెటిజ‌న్ల ప్రశంస‌లు!

ఇది టెక్నాల‌జీ యుగం. ఆ టెక్నాల‌జీ యుగ‌మే మ‌నుషుల‌ను సోమ‌రుల‌ను చేస్తోంది. దానికి ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకోవాల్సిన ప‌ని లేదు. చివ‌ర‌కు తినే తిండి కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నాం. అఫ్ కోర్స్‌.. వాటి వ‌ల్ల ఓ ప‌ది మందికి ఉపాధి క‌లుగుతుంది.. అది వేరే విష‌యం. సాధార‌ణంగా ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. జొమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్స్ లాంటి ఎన్నో యాప్స్ మన‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.

zomato delivery boy video goes viral

తాజాగా.. సోష‌ల్ మీడియాలో ఓ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. జొమాటో యాప్‌కు చెందిన ఓ డెలివ‌రీ బాయ్‌కి సంబంధించిన వీడియో అది. అత‌డు దివ్యాంగుడు. అన్నీ స‌క్ర‌మంగా ప‌నిచేసే వాళ్లే ఈరోజుల్లో ఏ ప‌ని చేయ‌కుండా ఒక‌రి మీద ఆధార‌ప‌డి బ‌తుకుతుంటారు. కానీ.. న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నా.. జొమాటో ఆర్డ‌ర్ల‌ను డెలివ‌రీ చేస్తూ త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డుతున్నాడు. అందుకే.. ఆ వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. మ‌నోడిని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. నువ్వు గ్రేట్ బాసూ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.