టికెట్‌ లేకున్నా రైళ్లో ప్రయాణించవచ్చు! కానీ..

-

గంటలకొద్ది టిక్కెట్‌ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇకపై టికెట్‌ తీసుకోకుండానే ప్రశాంతంగా రైలు ఎక్కేయొచ్చు. టికెట్‌ లేకుండా కూడా ప్రయాణం చేయవచ్చు. కానీ ఫ్లాట్‌ ఫాం టికెట్‌ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

చాలామంది చివరి నిమిషంలో టికెట్‌ దొరక్క రైలు ప్రయాణం ఆగిపోతుంది.. లేదా టికెట్‌ తీసుకునే సమయంలో క్యూ ఎక్కువగా ఉంటే తర్వాతి స్టేషన్‌ లో తీసుకోవచ్చులే అని రైలు ఎక్కేస్తుంటాం. అయితే, ఇటువంటి ప్రయాణికులకు ఇది శుభవార్త. టికెట్‌ తరువాతి స్టేషన్‌లో తీసుకుంటామనే సరికే టీసీ వచ్చి ఫైన్‌ వేసి వేళ్తాడు. ఎందుకంటే చాలా మంది సమాధానం ఇలానే చెబుతారిని టీసీ భావిస్తాడు. కానీ, ఇకపై అలాంటి టెన్షన్‌ ఉండదు. రైలు ప్రయాణానికి కేవలం ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ ఉంటే చాలు అంటూ గొప్ప వెసులుబాటు అందుబాటులోకి తీసుకువచ్చింది రైల్వే శాఖ.

రైల్వేశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం రైలు ప్రయాణికులు టికెట్‌ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కేవలం ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ తీసుకుంటే చాలు. దాన్ని కూడా ఇప్పుడు యూటీసీ యాప్‌ లేదా రైల్వే స్టేషన్లలోని వెండింగ్‌ మిషన్ల ద్వారా ప్లాట్‌ ఫామ్‌ తీసుకుంటే చాలు. రైలు ఎక్కిన తర్వాత దాన్ని టీసీకి చూపించి మీరు వెళ్లాల్సిన స్టేషన్‌ వరకు టికెట్‌ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కిన రైళ్లో సీట్లు లేకున్నా.. బెర్త్‌ దొరకకున్నా నిరభ్యంతరంగా రైలు ప్రయాణం కొనసాగించవచ్చు. లేదా రైలు ఎక్కిన వారు, రైలులోనే ప్రయాణిస్తూ ఆన్‌ లైన్‌ ద్వారా రిజర్వేషన్‌ కూడా చేసుకోవచ్చని రైల్వేశాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news