మారిటోరియంకు క్యాష్ బ్యాక్…!

రుణాలు తీసుకున్న వారికి బ్యాంకు లు గుడ్ న్యూస్ చెప్తున్నాయి. దీపావళి పండుగ సమయానికి మారిటోరియం కాలానికి సంబంధించిన వడ్డీని వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఈ ఆరు నెలలకు సంబంధించిన వడ్డీని బ్యాంకులు జమ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు క్యాష్‌బ్యాక్ ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ మీడియా తెలిపింది. “ప్రియమైన కస్టమర్ కోవిడ్-19 రిలీఫ్ ఎక్స్-గ్రేటియా … నవంబర్ 3 న మీ ఖాతాలో జమ చేసాము” అని ఒక వినియోగదారుకి వచ్చిన మెసేజ్ ని జాతీయ మీడియా ప్రస్తావించింది.

2020 మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే ఆరు నెలల తాత్కాలిక మారిటోరియం కాలానికి 2 కోట్ల రూపాయల వరకు రుణాల వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని బ్యాంకుయేతర ఆర్థిక సంస్థలతో సహా అన్ని రుణ సంస్థలను గత వారం రిజర్వ్ బ్యాంక్ కోరింది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 23 న దీనిపై ప్రకటన చేసింది. 2020 మార్చి 1 నుండి 2020 ఆగస్టు 31 మధ్య కాలానికి వడ్డీపై వడ్డీని జమ చేస్తారు. నవంబర్ 5 లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం బ్యాంకులను కోరింది.

గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, ఆటో రుణాలు, ఎంఎస్‌ఎంఇ రుణాలు ఈ పరిధిలో ఉన్నాయి. మారిటోరియం ని వాడుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఈ వడ్డీని జమ చేస్తారు.