IRCTC అదిరే టూర్ ప్యాకేజ్… ధర కూడా తక్కువే…!

-

IRCTC ఎన్నో టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. అయితే తాజాగా మరో కొత్త టూర్ ప్యాకేజ్ ని తీసుకు రావడం జరిగింది. ఈ టూర్ ప్యాకేజ్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC అదిరిపోయే ఆఫర్ ఒకటి తీసుకు వచ్చింది. అదే భారత్ దర్శన్ టూర్ ప్యాకేజీ.

 

IRCTC

ఈ టూర్ ఏయే ప్రదేశాలని కవర్ చేస్తుంది అనేది చూస్తే.. హైదరాబాద్, అహ్మదాబాద్, నిష్కలంక మహదేవ్ సీ టెంపుల్, అమృత్‌సర్, జైపూర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్లేస్‌లు అన్నీ తిరిగి రావొచ్చు. పైగా ఎక్కువ డబ్బులేమీ అయ్యిపోవు. ఈ టూర్ ప్యాకేజ్ ధర ఒక్కొక్కరికి రూ.11,340 మాత్రమే. టూర్ కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ట్రైన్ నడుపనుంది. దీని పేరు భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్. ఇందులోనే టూరిస్ట్ ప్లేస్‌లన్నీ చూసి రావడం జరుగుతుంది.

ఆగస్ట్ 29న ఈ టూర్ మొదలు అవుతుంది. సెప్టెంబర్ 10న ఈ టూర్ ముగుస్తుంది. అంటే 12 రోజులు పాటు టూర్ కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఐఆర్‌సీటీసీ ఎన్నో ప్యాకేజీలని అందించగా.. తక్కువ ధర టూర్ ప్యాకేజీల్లో ఇది కూడా ఒకటి అనే చెప్పాలి.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా మీరు టూర్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు అందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్, శానిటైజేషన్ కిట్స్ మొదలైన సదుపాయాలని ఐఆర్‌సీటీసీ ఇస్తుంది. కేవలం లోకల్‌ చార్జీలు ప్రయాణికులు పెట్టుకోవాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news