IRCTC కీలక నిర్ణయం…!

-

కరోనా వైరస్ కారణంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసినదే. అయితే ఒక్కొక్కటి మళ్ళీ క్రమంగా స్టార్ట్ అవుతున్నాయి. అలానే ఈ మధ్యనే ఐఆర్​సీటీసీ అందించే రెడీ టూ ఈట్​ లేదా ఈ-కేటరింగ్​ సేవలను కూడా స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఈ-కేటరింగ్ కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ క్యాటరింగ్ సేవల పునరుద్దరణకు అనుమతించలేమని పేర్కొంది. అంతే కాక, మొబైల్​ క్యాటరింగ్​ ప్రస్తుత ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని రైల్వే శాఖ అంది.

మొబైల్​ క్యాటరింగ్​ ప్రస్తుత ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలని ఇండియన్ రైల్వే తన క్యాటరింగ్, టికెటింగ్ విభాగానికి ఆదేశించింది. అయితే ఇప్పుడు ప్రత్యేక రైళ్లలో కేవలం ఈ-క్యాటరింగ్​ లేదా రెడీ- టు -ఈట్ సేవలు మాత్రమే ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ఆహారం తో కరోనా సంక్రమణ అవకాశం ఉన్న దృష్ట్యా, ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచి ఈ నిర్ణయం తీసుకున్నాం అని రైల్వే అధికారి అన్నారు.

షరతుల ప్రకారం వండిన ఆహారాన్ని ప్యాకెట్లలో అందించే మొబైల్ క్యాటరింగ్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని ఐఆర్​సీటిసి నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా మొబైల్​ క్యాటరింగ్​ సేవలు అందించనందుకు దీన్ని కాంట్రాక్టర్ డిఫాల్ట్‌గా పరిగణించ వద్దని, జరిమానా విధించ వద్దని, వారి సెక్యూరిటీ డిపాజిట్ (ఎస్‌డి), అడ్వాన్స్ లైసెన్స్ ఫీజును కూడా తిరిగి ఇవ్వాలని ఐఆర్‌సిటిసిని రైల్వే శాఖ ఆదేశించింది.

అలానే లైసెన్స్​ ఫీజును తగ్గించి స్ట్రాటిక్​ యూనిట్లకు అనుమతిచ్చిన విధం గానే మొబైల్​ క్యాటరింగ్​ సర్వీసులను కూడా పెర్మిషన్ ఇవ్వాలని కోరుతూ 2021 జనవరి 4న లేఖ రాసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మొబైల్​ క్యాటరింగ్​ సేవలకు అనుమతించ లేమని జనవరి 27, ఫిబ్రవరి 8న విడుదల చేసిన లేఖ లో రైల్వే బోర్డ్​ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే ఇండియన్ రైల్వే మొబైల్ క్యాటరర్స్ అసోసియేషన్ మద్రాసు హైకోర్డు లో పిల్​ దాఖలు చేసింది. అయితే విచారణ చేపట్టిన హైకోర్టు రైల్వే బోర్డు నిర్ణయం మేరకు నడుచుకోవడాలని ఐఆర్ఎంసిఎ కి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news