రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్… రేపటి నుండి ఈ సేవలు..!

-

ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ఇప్పటి నుండి ట్రైన్ లో ప్రయాణం చేసే వాళ్ళకి ఫుడ్ విషయం లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ సేవలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తీసుకు రానుంది. దీని వల్ల ప్రయాణికులకు మంచి బెనిఫిట్ కలగనుంది అని రైల్వే శాఖ చెప్పింది. గతేడాది మార్చిలో కరోనా వైరస్ కారణంగా ఈ-కేటరింగ్‌ సేవలు నిలిపివేశారు. అయితే అప్పుడు ఆపేసిన ఈ సేవలని మాత్రం ఇంకా ప్రారంభించలేదు.

చాల నెలల తర్వాత ఈ-కేటరింగ్‌ సేవలను పునః ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే దీని వల్ల ప్రయాణికుల కి మంచి లాభం అనే చెప్పొచ్చు. తమ కి నచ్చిన ఫుడ్ ని బెర్త్ వద్దనే రిసీవ్ చేసుకోవచ్చు. ఎలా ఆర్డర్ చెయ్యాలి అనే విషయానికి వస్తే… ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ వెబ్‌సైట్‌ https://www.ecatering.irctc.co.in, 1323 నెంబర్‌ ద్వారా ఈ సేవలని పొందొచ్చు, లేదా ఈ-కేటరింగ్‌ యాప్‌ అయిన ‘Food on Track’ యాప్‌లోను ఆర్డర్‌ చేయొచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? ఈ సేవలని దశలవారీగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ, లక్నో, భోపాల్‌, సూరత్‌, పూణె, అహ్మదాబాద్‌, హౌరా, పాట్నా, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, సికింద్రాబాద్‌, ఎర్నాకుళం, ఉజ్జయిని, పన్వెల్‌తో పాటు పలు స్టేషన్లలో ఇది మొదట అందుబాటులోకి వస్తోంది. తొలుత 62 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news