ఈ ఖాతా ఉంటే రెండు లక్షల ఇన్సూరెన్స్ కవర్ పొందొచ్చు: SBI

-

స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఇక పూర్తిగా చూస్తే.. SBI రుపే డెబిట్ కార్డులను ఉపయోగించే అన్ని జన ధన్ ఖాతాదారులకు రూ .2 లక్షల వరకు ఉచిత ఏక్సిడెంటల్ కవర్ ని ఇస్తోంది.

SBI

డెబిట్ కార్డ్ వినియోగదారులు ప్రమాదవశాత్తు మరణ భీమా, కొనుగోలు రక్షణ కవర్ వంటి వివిధ ప్రయోజనాలకు అర్హులు. అలానే రూపే కార్డులను ఉపయోగించే జాన్ ధన్ ఖాతాదారులు కూడా కొన్ని ప్రయోజనాలకు అర్హులు.

ఇది ఇలా ఉంటే జన ధన్ ఖాతా ఉన్న వారు, బ్యాంకు నుండి రుపే పిఎంజెడివై కార్డు పొందండి. జనవరి 28, 2018 వరకు తెరిచిన జన ధన్ ఖాతాల పై జారీ చేసిన రుపే పిఎమ్‌జెడివై కార్డులు రూ .1 లక్షల బీమా కలిగి ఉంటాయి.

అదే ఆగస్టు 28, 2018 తర్వాత జారీ చేసిన రూపే కార్డులకు ప్రమాదవశాత్తు కవర్ ప్రయోజనం రూ .2 లక్షల వరకు లభిస్తుంది.

అర్హత:

ప్రమాదానికి 90 రోజుల ముందు వరకు రూపే డెబిట్ కార్డును ఉపయోగించి జన్ ధన్ ఖాతాదారులు ఇంట్రా మరియు ఇంటర్ బ్యాంక్ రెండింటిలోనూ ఏదైనా దానిలో విజయవంతమైన ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని చేసి ఉండాలి.

ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్ అవసరం :

దావా ఫారం సక్రమంగా పూర్తయి. సంతకం చేసి ఇవ్వాలి. అలానే మరణ ధృవీకరణ పత్రం యొక్క అసలు లేదా ధృవీకరించబడిన కాపీ. దానితో పటు ప్రమాదం గురించి వివరణ ఇచ్చే ఎఫ్ఐఆర్ లేదా పోలీసు నివేదిక యొక్క అసలు లేదా ధృవీకరించబడిన కాపీ.

ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలతో పాటు పోస్టుమార్టం రిపోర్ట్ యొక్క ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ కాపీ. కార్డుదారుడు మరియు నామినీ యొక్క ఆధార్ కాపీలు వంటివి అవసరం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news