నిరుద్యోగులకు గుడ్ న్యూస్… SBI లో పలు ఖాళీలు…!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎస్బీఐ. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

ఫార్మసిస్ట్ విభాగం లో ఖాళీల భర్తీకి తాజాగా బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి ఫార్మసీలో డిప్లొమో(D Pharma) చేసి ఉండాలి.

లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా డీ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. మొత్తం ఇందులో 67 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజును రూ. 750గా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు లో మినహాయింపు వుంది. చేసేందుకు మే 3 ఆఖరి తేదీ.

నోటిఫికేషన్ లింక్ https://www.sbi.co.in/documents/77530/11154687/12042021_01+-+Detailed+Ad+%28Pharmacist%29-Final.pdf/5973cce2-5ca0-9dbe-7d17-8946b3ab083d?t=1618232929651 అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in/sbiphccmar21/

 

Read more RELATED
Recommended to you

Latest news