ఏపీ సర్కార్ కీలక నిర్ణయం… 21మంది అధికారులతో కొవిడ్‌ టాస్క్ ఫోర్స్

-

కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులకు బాధ్యతల అప్పగించింది. 21మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.

టాస్క్ ఫోర్సులో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రవిచంద్ర, పీయూష్‌కుమార్‌, బాబు.ఎ, మల్లికార్జున్‌, విజయరామరాజు, అభిషేక్‌ మహంతి, శ్రీకాంత్‌ వంటి అధికారులు ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. 13 జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం చేశారు. ఇక కరోన నివారణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సీఎం సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news