కేంద్రం: ఎల్ఐసీకి ఇక నుండి ప్రతీ శనివారం పబ్లిక్ హాలిడే…!

-

LIC తమ పాలసీదారులకి చక్కటి సేవలని అందిస్తుంది. వివిధ రకాల పాలసీలని ఇస్తుంది. పైగా పాలసీదారులు ఎన్నో రకాల సర్వీసులని పొంది లాభాలని తీసుకుంటారు. అయితే దేశం లో అతి పెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారాలకు ముఖ్యమైన అలర్ట్…! ఈ విషయాన్నీ మీరు తప్పక గమనించాలి.

ఇక నుండి ఎల్ఐసీకి ప్రతీ శనివారం కూడా సెలవు ఉండనుంది. ఇది పాలసీదారులు గమనించాలి. అయితే దీనికి సంబంధించి పలు వివరాల లోకి వెళితే… ఎల్ఐసీకి ఇక నుండి ప్రతీ శనివారం కూడా సెలవు ఉండనుంది అని ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఐసీకి ప్రతీ శనివారం సెలవు ప్రకటిస్తూ ‘నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ 1881 ’లోని సెక్షన్‌ 25 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసకుంది.

 ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి రానున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి నుంచి ఎల్ఐసీ కార్యాలయాలకు ప్రతీ శనివారం సెలవు ఉండనుంది.(ప్రతీకాత్మక చిత్రం)

దీనికి సంబంధించి గురువారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్ ‌లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం తక్షణం అమల లోకి రానున్నట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇప్పటి నుంచి ఎల్ఐసీ కార్యాలయాలకు ప్రతీ శనివారం సెలవు ఉండనుంది. కాబట్టి LIC పాలసీదారులు దీనిని గమనించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news