LIC పాలసీదారులకి అలర్ట్.. వెంటనే ఇలా చెయ్యండి…!

-

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ వంటి వాటిని తీసుకు వచ్చి కస్టమర్స్ కి అదిరే లాభాలని ఇస్తోంది. మీరు కూడా ఎల్ఐసీ పాలసీ తీసుకున్నారా…? అయితే మీరూ వీటిని తెలుసుకోవాలి.

తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కి ముఖ్యమైన అలర్ట్ ఒకటిని పంపడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉందా..? అయితే తప్పక మీరు వెంటనే ఈ పని పూర్తి చెయ్యాలి. లేదు అంటే ఇబ్బందులు వస్తాయి. పాలసీ కలిగిన వారు కచ్చితంగా పాన్ కార్డుతో లింక్ చేసుకోవాలని కంపెనీ అంది. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

రూ.50 వేలకు పైన నగదు చెల్లింపులకు కచ్చితంగా పాన్ కార్డు అవసరం గమనించండి. కనుక పాలసీ తో మీ యొక్క పాన్ నెంబర్ ని లింక్ చెయ్యండి. ఇది ఇలా ఉంటే పాలసీతో పాన్ కార్డు లింక్ చేసుకోవడం వలన మరి కొన్ని లాభాలు కూడా ఉంటాయి.

లింక్ చేసుకోవాలంటే మీరు ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పాలసీని పాన్ తో లింక్ చెయ్యచ్చు. ఇది కేవలం మూడు స్టెప్స్ లో చెయ్యచ్చు. మొదట మీరు ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్లి.. అక్కడ ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పాలసీ పాన్ నెంబర్ లింక్ చెయ్యచ్చు అంతే.

Read more RELATED
Recommended to you

Latest news