ఆధార్ లింక్ నుండి ఆదాయ పన్ను ఫైలింగ్ వరకు మార్చి 31వ తేదీలోగా చేయాల్సిన పనులు..

-

2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చేస్తుంది. మార్చి 31వ తేదీ అన్ని ఆర్థిక కార్యకలాపాలకి చివరి రోజు. ఈ రోజు వరకు ఆర్థికపరమైన లావాదేవీలని పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఐతే 31వ తేదీ వరకు పూర్తి చేయాల్సిన పనుల జాబితా ఏంటో చూద్దాం.

ఆదాయ పన్ను

ప్రతీ సంవత్సరం ఆదాయ పన్ను ఫైలింగ్ చేయడం కంపల్సరీ. మార్చి 31వ తేదీలోగా ఈ తంతు పూర్తి చేయాల్సిందే. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళైనా, పాత వాళ్ళైనా ప్రతీ ఒక్కరూ ఈ తేదీలోగా ఆధాయ పన్ను ఫైలింగ్ పూర్తి చేయాలి. 2020-21సంవత్సరంలో మీ ఆదాయం ఎంత అనేది ఆదాయ పన్ను శాఖ వారికి లెక్కలు చూపించేయండి.

ఆధార్ లింక్

పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకోవాల్సిన ఆఖరి తేదీ కూడా మార్చి 31వ తారీఖే. ఈ లోగా ఆధార్ కార్డుని పాన్ కార్డుకి లింక్ చేసుకుంటే మంచిది. లేదంటే పాన్ కార్డ్ పనిచేయకుండా పోతుంది. దానివల్ల భవిష్యత్తుల్లో పాన్ కార్డ్ అవసరపడే లావాదేవీలు నిర్వహించాలంటే కుదరకుండా పోతుంది.

రివైస్డ్ ఇన్ కమ్ టాక్స్ ఫైలింగ్

2019-20సంవత్సరానికి గానూ రివైస్డ్ ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయనట్లయితే మార్చి 31వ తేదీ వరకు ఫైల్ చేయండి. లేదంటే ఆ తర్వాత 10వేల వరకు జరిమానా ఉంది. మీ ఆదాయం 5లక్షల లోపు ఉన్నట్లయితే వెయ్యి రూపాయల జరిమానా విధించబడుతుంది.

ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్

అక్టోబర్ 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ చివరి తేదీ కూడా మార్చి 31వ తేదీనే. దీంట్లో జీఎస్టీ నంబరుతో పాటు జీస్టీ పన్ను ఉంటుంది.

వివాద్ సే విశ్వాస్

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వివాద్ సే విశ్వాస్ కింద పన్ను కట్టేవాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా కట్టని ఆదాయ పన్నుని తగ్గించి అటు ఆదాయ శాఖకి ఇటు పన్ను కట్టేవాళ్ళకి లాభం చేకూర్చేలా చేసేదే ఈ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ లక్ష్యం.

Read more RELATED
Recommended to you

Latest news