ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌!

-

ఎల్‌పీజీ సిలిండర్‌ వినియోగదారులకు ఇది శుభవార్తే. ఇక ఎక్కడైనా గ్యాస్‌ సిలిండర్‌ పొందే అవకాశాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసీఎల్‌) కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉంటున్నారు. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక ప్రతీదీ ఇంట్లోనే వండుకొని తినే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అకస్మాత్తుగా మీ ఇంట్లో గ్యాస్‌ అయిపోతే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసి డెలివరీ అయ్యే వరకు వేచి చూడాల్సి వస్తుంది.

 

అలా కాకుండా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఫ్రీ ట్రేడ్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మీ సమీప పెట్రోల్‌ పంప్, కిరాణా దుకాణాల్లో గ్యాస్‌ సిలిండర్‌ లభిస్తుందని కంపెనీ ట్వీట్‌ చేసింది.
చిరునామాతో సంబంధం లేకుండా ఈ చిన్న గ్యాస్‌ సలిండర్‌ ను పొందవచ్చని తెలిపింది. బ్యాచ్‌లర్స్‌కు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. స్థానిక చిరునామా లేని వారికి కూడా ఇది సులభంగా లభిస్తుంది. ఈ చిన్న ఎల్‌పిజి సిలిండర్‌ మీ సమీప పెట్రోల్‌ పంప్, కిరాణా దుకాణాల్లో లభిస్తుంది. మామూలు గ్యాస్‌ సిలిండర్‌ అయతే అడ్రస్‌ ప్రూఫ్‌ ఇతరలు ఇవ్వాలి. దీనికి ఆ అవసరం లేదు.

ఏదైనా గుర్తింపు కార్డు చూపించి తేసుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం దీని ధర రూ. 495 వరకు ఉందని తెలిపారు. ఇవి ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంపులు, కిరాణా దుకాణాలు, స్థానిక సూపర్‌ మార్కెట్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చన్నారు. అయితే, దీనికోసం మీరు 8454955555 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా 5 కేజీల సిలిండర్లను బుక్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సిలిండర్‌ను మీరు వాట్సాప్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ‘Refill’ అని టైప్‌ చేసి 7588888824 నంబర్‌కు పంపాలి. అంతే, ఇక సిలిండర్‌ డెలివరీ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news