ఎక్కువ పొరలున్న‌ మాస్క్ వల్ల ఎక్కువ భద్రత వస్తుందా? అధ్యయనం ఏం చెబుతోంది?

-

కరోనా మహమ్మారి వచ్చి మాస్క్ కంపల్సరీ చేసేసింది. దాదాపు సంవత్సరం పాటుగా మాస్క్ పెట్టుకునే ఉంటున్నాం. గత ఏడాది మార్చిలో మొదలైన కరోనా ఇప్పటికీ తన పంజాని విసురుతూనే ఉంది. దాన్నుండి రక్షణ పొందడానికి మాస్క్ పెట్టుకుంటూనే ఉన్నాం. మాస్క్ పెట్టుకుంటే రక్షణ వచ్చినట్టేనా? మనం పెట్టుకునే మాస్కులు సరైనవేనా? కరోనా రాకుండా అడ్డుకునే చర్య మనం ధరించే మాస్క్ తీసుకుంటుందా? ఎలాంటి మాస్క్ ధరించలి? ఏ విధమైన మాస్క్ ఎక్కువ రక్షణ ఇస్తుంది అనేది చాలా మందికి రకరకాల సందేహాలు ఉన్నాయి.

తాజా అధ్యయనం ప్రకారం ఎక్కువ పొరలున్న మాస్కులని ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుందని అంటున్నారు. ఎక్కువ పొరలున్న మాస్కులు నీటి తుంపరలని గాలిలోకి వెళ్ళనీయకుండా ఆపుతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పేర్కొంది. ఈ మేరకు పరిశోధనలు జరిపిన బృందం, ఆసక్తికరమైన విషయాలని వెల్లడి చేసింది. ఎక్కువ పొరలున్న మాస్కులని ధరించడం వల్ల నీటి తుంపర్లు ఒక దాని నుండి మరొకదానికి ప్రయాణం చేసేసరికి, వాటి వేగం తగ్గుతుంది. అంతేకాకుండా గాలిలోకి తక్కువ పరిమాణంలో వెళ్తాయి.

కాబట్టి అప్పుడు ఇతరులకి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ మేరకు కెమెరా ద్వారా చూసిన బృందం, ఒకే పొర ఉన్న మాస్కు నుండి అధిక శాతంలో నీటి తుంపర్లు బయటకు వెళ్తున్నాయని, ఎక్కువ పొరలుండడం వల్ల అడ్డుకునే వీలు కలుగుతుందని తెలిపింది. కొన్ని సార్లు మాస్క్ పక్కల నుండి నీటి తుంపర్లు బయటకు వెళ్తున్నాయని చెప్పారు. దాన్ని నివారించడానికి సరైన మాస్కులు ధరిస్తే బెటర్ అని చెబుతున్నారు. ముఖ్యంగా బట్టతో చేసిన మాస్క్ అయితే మరింత బాగుంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news