ఫ్లిప్‌కార్ట్ తీసుకున్న సరి కొత్త నిర్ణయం…!

Join Our Community
follow manalokam on social media

ఫ్లిప్ కార్ట్ తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ-కామ‌ర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పర్యావరణానికి హాని కలిగించకూడదు అని కీలక నిర్ణయం తీసుకొచ్చింది. ఇక నుండి స‌రుకుల డెలివ‌రీకి పెట్రోల్ కార్గో వాహ‌నాల‌కు తోడుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను వినియోగించాల‌ని నిర్ణ‌యించింది. అలానే 2030 నాటికి 25 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తాం అని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

ఇది ఇలా ఉండగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, గౌహతి వంటి నగరాల్లో ఫ్లిప్ కార్ట్ డెలివరీల‌ కోసం టూ వీలర్స్ ని ప్ర‌వేశపెట్ట‌డం ప్రారంభించింది. అలానే EV వాహ‌నాల్లో 2-వీలర్, 3-వీలర్, అలాగే 4-వీలర్ వాహనాలు ఉన్నాయి. వాహనాల కోసం హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా ఎలక్ట్రిక్ మరియు పియాజియో వంటి కార్పొరేట్ ఈవీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది.

1,400 డెలివ‌రీ ఫెసిలిటీల‌కు దగ్గరగా ఛార్జింగ్ పాయింట్ల‌ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది. హీరో ఎలక్ట్రిక్ స్కూట‌ర్ల‌‌లోని ఎన్‌వైఎక్స్ సిరీస్ కూడా ఇప్పటికే వుంది. ఒకసారి దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది డెలివెరీ చెయ్యడానికి బాగా ఉపయోగ పడుతుంది.

అంతే కాకుండా కోల్‌కతా, గువహతి మరియు భువనేశ్వర్లలో ఫ్లిప్‌కార్ట్ యొక్క లాజిస్టిక్స్ డిప్లోయ్మెంట్ భాగస్వామి ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా తీసుకోవడం జరిగింది. ఇక పెద్ద మొత్తగా డెలివరీ చెయ్యాలంటే మహీంద్రా ఎలక్ట్రిక్ ట్రె జోర్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల‌ను ఉపయోగించాలని వినియోగించ‌నుంది. ఇలా ఫ్లిప్ కార్ట్ ఈ మార్పులు చేసింది.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...