కొత్త రూల్స్.. పీఎం కిసాన్‌ పథకంలో చేరాలంటే ఇక ఇవి తప్పనిసరి….!

కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం ఇస్తోంది. ఇప్పటి వాటాకు తొమ్మిది విడతల డబ్బులు జమ కాగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత డిసెంబర్ 15న వస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కిసాన్ క్రెడిట్ కార్డుల కూడా రైతులకి లాభదాయకంగా ఉంటుంది.

farmers

వీటి వలన తక్కువ వడ్డీకే లోన్స్ కూడా వస్తాయి. అయితే కొన్ని మోసాలు మరియు దరఖాస్తు విధానంలో కొన్ని తప్పులు వలన కొందరికి డబ్బులు పడడం లేదు. ఆ తప్పులను సరిదిద్ధుకుంటే డబ్బులు జమ అవుతాయి. ఇది ఇలా ఉంటే ఖాతా వివరాలను పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఆ ఖాతాకు సంబంధించి లావాదేవీలు నెల నెలా జరగడం లేదు.

అలానే ఖాతా నంబర్ తప్పుగా నమోదు చెయ్యడం లాంటివి జరుగుతున్నాయి. అలానే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆధార్ లింక్ జరగపోవడం వలన అలానే అన్ని సరిపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరెక్షన్ పెండింగ్ లో ఉండటం కూడా జరుగుతోంది.

ఇకపోతే బీహార్ లో చాలా మంది నకిలీ ధ్రువ పత్రాలు స్పష్టించి డబ్బులు పొందారు. అయితే ఇవన్నీ చూస్తే అర్హుల చేతికి డబ్బులు అందకుండా అనర్హులకు ఇది అవకాశంగా మార్చుకున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక కొత్త రూల్స్ గురించి చూస్తే… లబ్ధిదారుడికి రేషన్ కార్డు ముఖ్యం. అలానే వ్యవసయ భూమి పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ , రేషన్ కార్డు అవసరం. డిక్లరేషన్ ఫారమ్ సాప్ట్ కాపీలను పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చెయ్యడం మరిచిపోకండి.