వేతన చట్టం: పది నిమిషాలు అదనంగా పని చేసినా 30నిమిషాల ఓవర్ టైమ్ కిందే లెక్క..

ప్రభుత్వం తీసుకువచ్చిన వేతనచట్టంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. చేతికి అందే జీతం, పని చేసే సమయం, జీతం చెల్లింపులు, ప్రాఫిడెంట్ ఫండ్లకి సంబంధించిన అనేక మార్పులు ఇక్కడ చూస్తున్నాము. 2019లో వేతన చట్టం పార్లమెంట్ లో ఆమోదం పొందింది. దాని ప్రకారం ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకి ఆ చట్టాన్ని అన్వయించేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వేతన చట్టానికి అనుగుణంగా కంపెనీలన్నీ తమ హెచ్ ఆర్ పాలసీని మార్చుకోవాల్సి ఉంది.

పని సమయం గరిష్టంగా 12గంటలు

వేత చట్టం ప్రకారం గరిష్ట పని సమయం 12గంటలుగా ఉంది. అంతకంటే 10నిమిషాలు ఎక్కువ పనిచేసినా అది 30నిమిషాల ఓవర్ టైమ్ గా లెక్కించబడి దానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ పద్దతి వేరేగా ఉండేది. పని గంటల తర్వాత అరగంట పని చేసినా దానికి ఎలాంటి చెల్లింపులు ఉండేవి కావు. అలాగే ఒక ఉద్యోగి 5గంటలు పనిచేసిన తర్వాత అరగంట పాటు విశ్రాంతి తీసుకునే స్వేఛ్ఛ ఉంది. ఐదు గంటల కంటే ఎక్కువ సేపు నిరంతరాయంగా పనిచేయడం నిషిద్ధం.

గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్లలో మార్పులు

పీఎఫ్, గ్రాట్యుటీ ఫండ్లలో పెరుగుదల ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ పెరిగినపుడు చేతికి అందే జీతంలో తరుగుదల ఉంటుంది.

అలాగే అలవెన్సులు గరిష్టంగా జీతంలో 50శాతం ఉంటాయి. దీనివల్ల ఆల్రెడీ యాభైశాతం కంటే ఎక్కువ బేసిక్ సాలరీ ఉన్నవారి మీద ఎలాంటి ప్రభావం చూపదు. కానీ 50శాతం కంటే తక్కువ జీతం ఉన్నవారికి చేతికి వచ్చే జీతంలో మార్పులు ఉంటాయి.

బేసిక్ సాలరీ ఆధారంగా పీఎఫ్ లెక్కించబడుతుంది కాబట్టి పీఎఫ్ లో మార్పు వస్తుంది. ఎక్కువ జీతాలున్న ఉద్యోగుల మీద దీని ప్రభావం ఉంటుంది. పీఫ్, గ్రాట్యుటీ పెరగడం వల్ల కంపెనీల మీద వ్యయం బాగా పెరుగుతుంది.

పీఎఫ్, గ్రాట్యుటీ పెరగడం వల్ల రిటైర్ మెంట్ తర్వాత వచ్చే డబ్బు కూడా పెరుగుతుంది. దీనివల్ల రిటైర్ మెంట్ తో గరిష్ట లాభాలు పొందవచ్చు.