GST కడుతున్నారా..? అయితే తప్పులు చెయ్యకండి…!

-

జీఎస్‌టీ కడుతున్నారా…? అయితే మీరు ఈ తప్పులని చెయ్యకండి. ప్రభుత్వాన్ని మోసం చేయాలని మీరు భావించవద్దు. అలా కనుక మీరు మోసం చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి దీని కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. ఇక ఈ వస్తు సేవల పన్ను GST గురించి చూస్తే… కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి.

ఇక వాటి కోసం చూస్తే… జీఎస్‌టీ అధికారులకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. జీఎస్‌టీ చెల్లింపుల్లో అవకతవకలు కనుక ఉంటే రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసేస్తారు. కాబట్టి మీరు కనుక జీఎస్‌టీ చెల్లించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇలా ఉండగా సప్లయన్స్ దాఖలు చేసే రిటర్న్స్.. మీరు చెల్లించే జీఎస్‌టీఆర్ 1 రిటర్న్స్‌ లో భారీగా వ్యత్యాసం ఉంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ రద్దు చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే…? పన్ను ఎగవేతను అరికట్టేందుకే. అందువల్ల జీఎస్‌టీ కట్టే వారు మోసాలకు పాల్పడవద్దు అని హెచ్చరిస్తున్నారు.

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ ని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC అందుబాటు లోకి తెచ్చింది. అయితే మోసం చేయడం వల్ల జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. ఇది ఇలా ఉండగా జీఎస్‌టీ అధికారులకు ఇప్పటికే ఫేక్ ఇన్వాయిస్‌ అంశంపై కూడా దృష్టి పెట్టారు. అలానే స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. దీని వల్ల గత కొన్ని నెలలుగా ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఎక్కువయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news