ఇకపై మీరు వాట్సప్‌ ప్రొఫైల్‌ ఫోటోను స్క్రీన్‌ షాట్‌ తీయలేరు

-

వాట్సప్‌లో ఎప్పుడు ఏదో ఒక అప్‌డేట్‌ వస్తూనే ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ ప్రతి ఒక్కరు వాట్సప్‌ను వాడతారు. అసలు వాట్సప్‌ వాడని వాళ్లు ఎవరూ ఉండరు కదా..! మనం కొన్ని సంవత్సరాలు వాట్సప్‌ను వాడుతున్నాం.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో అప్‌డేట్‌లు వచ్చాయి. అయితే ఈ మధ్య డీప్‌ ఫేక్‌ ఇమేజ్‌లు ఎక్కువయ్యాయి. అబ్బాయిలు సైతం వారి అకౌంట్లను ప్రైవేట్‌లో పెట్టేసుకుంటున్నారు. ఇక వాట్సప్‌లో కూడా ప్రొఫైల్‌ ఫోటో ఎవ్రీవన్‌ నుంచి తీసేసి మై కాంటాక్స్‌ వరకే పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ మన్‌ డీపీని ఎవరైనా స్క్రీన్‌షాట్‌ తీసుకునే అవకాశం ఉంది. ఇకపై అలా జరగదు.. కొత్త అప్‌డేట్‌ అదే..!

Web Betainfo ప్రకారం, WhatsApp ప్రొఫైల్ చిత్రం స్క్రీన్‌షాట్ తీయడం కుదరదు.. ఈ కొత్త ఫీచర్ మీ వాట్సాప్‌లో రాబోతోంది. ఆండ్రాయిడ్ బీటా టెస్ట్ కోసం WhatsApp ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. పరీక్షించిన తర్వాత, కొత్త అప్‌డేట్‌లో వినియోగదారులందరి ఉపయోగం కోసం ఇది విడుదల చేస్తారు.
ఈ గోప్యతా లక్షణాన్ని ఉపయోగించడానికి, వినియోగదారులు అప్డేట్‌ వెర్షన్ 2.24.4.25ని ఇన్‌స్టాల్ చేయాలి. యూజర్ ప్రైవసీని పెంచేందుకు కంపెనీ ఈ ఫీచర్‌ను తీసుకువస్తోంది.

దాదాపు 5 సంవత్సరాల క్రితం ఇతర వినియోగదారుల ప్రొఫైల్ ఫోటోలను సేవ్ చేసే ఎంపికను WhatsApp తొలగించింది. అయితే ఇప్పుడు స్క్రీన్‌షాట్‌లు తీసుకోవచ్చు. ఇక ఈ ఫీచర్ తర్వాత, ఎవరైనా మీ ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్‌షాట్ తీస్తే, వారికి అలర్ట్ మెసేజ్ కనిపిస్తుంది. దాంతో ఎవరు స్క్రీన్ షాట్‌ తీయడానికి ప్రయత్నించలేరు.

వాట్సప్‌లో ఎన్నో ఫీచర్స్‌ వస్తాయి.. కానీ అందులో కొన్ని మాత్రమే మనకు బాగా ఉపయోగపడతాయి కదా..! కొన్ని డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ మెసేజ్‌లా తలకిక్కగా ఉంటాయి.. అవతలి వ్యక్తి మనం ఏం మెసేజ్‌ చేశామో తెలుసుకోవద్దు అనే ఆ ఆప్షన్‌ ఉపయోగిస్తాం.. మళ్లీ అలా డిలీట్‌ చేసినట్లు కనిపిస్తే.. ఇక చూసినవాళ్లకు.. ఏం డిలీట్‌ చేసార్రా అని డౌట్‌.. అనవసరమైన పంచాయితీ.. ఈ ఎడిట్‌ ఆప్షన్‌ కూడా అంతే.. ఎడిట్‌ చేశాం బాగానే ఉంది. మళ్లీ ఎడిటెడ్‌ అని ఎందుకు కనిపిస్తుంది.. అని యూజర్లు అంటున్నారు..మీరు ఇలానే ఫీల్‌ అవుతున్నారా..?

Read more RELATED
Recommended to you

Latest news