కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా వన దేవతలను దర్శించుకొని ప్రధాని నరేంద్ర మోడీ తరపున మొక్కలు చెల్లించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. రేపు చాలా మంది కేంద్ర మంత్రులు వన దేవతల దర్శనం కోసం మేడారం రాబోతున్నారని ప్రకటించారు. మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని చెప్పారు.
అయితే అనేక మంది మేడారం ను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నట్టు గుర్తుకు చేసారు. జాతీయ పండుగ అనేది ఎక్కడా లేదని.. ఈ మహాజాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వర్సిటీ క్యాంపస్ చేసి ఈ ఏడాది నుంచి ప్రవేశాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. వర్సిటీ భవనాలను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చేత శంకుస్థాపన చేయిస్తామని హమీ ఇచ్చారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు.