నీట్ ఎగ్జామ్స్ వాయిదాపై క్లారిటీ ఇచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ..

-

మెడికల్ ఎంట్రన్స్ కోసం జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి షాక్ తగిలేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. నీట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ వస్తున్న డిమాండుని పక్కన పెట్టిన ఏజెన్సీ, వాయిదా వేసే ప్రసక్తే లేదని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం (సెప్టెంబరు 12వ తేదీన ) పరీక్షలు నిర్వహిస్తామని, అందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ మేరకు ఇండియా టీవీతో మాట్లాడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి ఈ వ్యాఖ్యలు చేసారు.

సీబీఎస్ఈ పరీక్షలు నీట్ ఎగ్జామ్స్ మధ్య రోజుల వ్యవధి ఉందని, దానివల్ల పెద్ద ఇబ్బందేమీ కలగదని, అందువల్ల నీట్ ఎగ్జామ్స్ ని వాయిదా వేసే ఆలోచన లేదని అన్నారు. గతంలో ఒకానొక పత్రికతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి, నీట్ యూజీ పరీక్షలను రెండు నెలలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. లాజిస్టిక్ సమస్యలు, ఇతర కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉందని అన్నారు.

ఇటు వైపు విద్యార్థులు మాట్లాడుతూ, సీబీఎస్ఈ పరీక్షల్లో కంపార్ట్ మెంట్ ఎగ్జామ్స్, ఇంప్రూవ్ మెంట్ మొదలైన పరీక్షలు ఉన్నాయని, దానివల్ల నీట్ ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతున్నారు. సీబీఎస్ఈ ఇంటర్మీడియర్ విద్యార్థులకు సెప్టెంబరు 6వ తేదీన బయాలజీ పరీక్ష, సెప్టెంబర్ 9 న ఫిజిక్స్ ఉన్నాయి. ఈ ఉద్దేశ్యంతో నీట్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతకుముందు అనుభవ్ శ్రీవాస్తవ, ఇండియావైడ్ పేరెంట్స్ అసోసియేషన్ న్యాయవాది ఒక లేఖ రాసారు. నీట్ ఎగ్జామ్స్ ని ఒక వారం రోజుల పాటు లేదా 10రోజుల పాటు వాయిదా వేయాలని విద్యాశాఖ మంత్రి లేఖ రూపంలో తెలియజేసారు.

ప్రస్తుతం ఎగ్జామ్స్ తేదీల వివరాలు.

నీట్: సెప్టెంబర్ 12
CBSE 12 వ తరగతి ఇంప్రూవ్ మెంట్, కంపార్ట్మెంట్ పరీక్షలు (ఆగస్టు 25 నుండి సెప్టెంబరు 15వరకు)
ICAR AIEEA 2021 UG (BSc అడ్మిషన్ల కోసం): సెప్టెంబర్ 7, 8, 13
కర్ణాటక COMEDK: సెప్టెంబర్ 14
ఒడిశా జేఈఈ: సెప్టెంబర్ 6 నుంచి 18 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news