ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే రెండు లక్షల వరకు ప్రయోజనం…!

-

కేంద్రం చాల స్కీమ్స్ ని తీసుకు వస్తోంది. అయితే వాటిలో ఈ జన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటి వుంది. ఈ స్కీమ్ వలన ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా రెండు లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

జన్ ధన్ యోజన స్కీమ్ వలన బెనిఫిట్స్ బాగుంటాయి. అసలు ఈ స్కీమ్ ఎందుకు వచ్చింది అనేది చూస్తే… కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ బ్యాంక్ సర్వీసులు అందుబాటు లోకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది.

ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతా తెరవొచ్చు. ఈ స్కీమ్ లో కనుక జాయిన్ అయితే అప్పుడు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స కవరేజ్ లభిస్తుంది. అది కూడా ఫ్రీ గానే. రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా వస్తుంది. దానితో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నగదు బదిలీ ప్రయోజనాలు కూడా ఈ ఖాతా లో వస్తాయి.

ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి అనే రూల్ ఏమి లేదు. సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ రేట్లే ఈ ఖాతాకు కూడా వర్తిస్తాయి గమనించండి. దాంతో పాటుగా ఉచిత మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు కూడా వున్నాయి. ఉచితంగానే రూపే డెబిట్ కార్డు పొందొచ్చు.

అలానే రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లభిస్తుంది. ఇలా పలు రకాల బెనిఫిట్స్ వస్తాయ్. బ్యాంక్ అకౌంట్ లేకపోతేనే జన్ ధన్ ఖాతా తెరవడానికి వీలవుతుంది. అందరు తెరిచే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news