ఒక్క నిమిషం, ఫోన్ లో ఆ యాప్స్ అర్జెంట్ గా డిలీట్ చేయండి…!

-

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక యాప్స్ సందడి చేస్తున్నాయి. కాస్త ఆకర్షణీయంగా ఉండటంతో జనం కూడా వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వాటి వలన అనేక నష్టాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. అనవసర యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వందల కొద్దీ యాప్స్ మీ ఫోన్ లో సమస్యలను తెచ్చి పెడుతున్నాయి.

ఈ నేపధ్యంలో గూగుల్ షాక్ ఇచ్చింది. ప్లే స్టోర్ నుంచి 17 యాప్స్‌ని డిలిట్ చేసింది గూగుల్. సెక్యూరిటీ కంపెనీ బిట్‌డిఫెండర్ వాటిని రిస్క్‌వేర్ యాప్స్‌గా గుర్తించడంతో పాటుగా, వాటిని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఇప్పటికే ఆ 17 యాప్స్‌ని 5,50,000 సార్లు డౌన్‌లోడ్ చేసినట్టు గుర్తించిన గూగుల్, డెలీట్ చేసుకోవాలని సూచించింది. వాటి వలన మీ ఫోన్ మోడల్, ఐఎంఈఐ నెంబర్, ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, లొకేషన్ లాంటి కీలక సమాచారాన్ని దొంగలిస్తాయి. వాటిని అర్జెంట్ గా మీ ఫోన్ లో ఉంటే తీసేయండి. ఒకసారి ఆ యాప్స్ ఏంటో చూద్దాం.

Car Racing 2019
2. 4K Wallpaper (Background 4K Full HD)
3. Backgrounds 4K HD
4. Barcode Scanner
5. Clock LED6. Explorer File Manager
7. File Manager Pro – Manager SD Card/Explorer
8. Mobnet.io: Big Fish Frenzy
9. Period Tracker – Cycle Ovulation Women’s
10. QR & Barcode Scan Reader
11. QR Code – Scan & Read a Barcode
12. QR Code Reader & Barcode Scanner Pro
13. Screen Stream Mirroring
14. Today Weather Radar
15. Transfer Data Smart
16. VMOWO City : Speed Racing 3D
17. Wallpapers 4K, Backgrounds HD

Read more RELATED
Recommended to you

Latest news