పోస్ట్ ఆఫీస్: మహిళల కోసం కేంద్రం నుండి సూపర్ స్కీమ్… ఎన్నో లాభాలు..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ తో ఎన్నో లాభాలని చాలా మంది పొందుతున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా చాలా వున్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ వలన చాలా మందికి బెనిఫిట్ కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం మహిళా సమ్మాన్ స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఏప్రిల్ 1 నుంచే పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చింది ఈ పథకం. ఇక పూర్తి వివరాలు చూస్తే.. మహిళలకు ఆర్థిక చేయూత ని ఈ స్కీమ్ కల్పిస్తోంది.

వడ్డీ రేటు బాగానే ఉంటుంది. రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఇది. మహిళ లేదా మైనర్ ఆడపిల్ల పేరిట గార్డియన్ అయినా సరే అకౌంట్ తెరవొచ్చు. 7.5 శాతం వడ్డీ రేటు వస్తోంది. ప్రతి 3 నెలలకు ఒక సరి అకౌంట్లో జమ అవుతుంది. కనీసం రూ.1000 డిపాజిట్‌తో అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవడానికి అవుతుంది.

ఈ స్కీం రెండేళ్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరాలంటే ముందు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ని ఓపెన్ చేయాలి. KYC డాక్యుమెంట్, KYC ఫాం తీసుకుని. వివరాలు సమర్పించాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు లో ఈ స్కీమ్ ని ఓపెన్ చేసేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version