అదిరే స్కీమ్.. రూ.150 పొదుపుతో రూ.24 లక్షలు పొందొచ్చు..!

చాలా మంది స్కీమ్స్ లో డబ్బులు పెట్టి మంచిగా లాభాలని పొందుతూ వుంటారు. అయితే మీరు కూడా స్కీమ్స్ లో డబ్బులు పెట్టి మంచి లాభాలని పొందాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ స్కీమ్ గురించి చూడాలి. పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు. ఇక ఆ అదిరే స్కీమ్ గురించి చూస్తే..

Postoffice
Postoffice

ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా మంచి రాబడిని సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే స్కీమ్ ప్రాతిపదికన మీకు లభించే బెనిఫిట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. పోస్టాఫీస్ అందించే పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF పీపీఎఫ్ స్కీమ్ కూడా ఒకటుంది. దీని వలన అదిరే లాభాలని మనం పొందొచ్చు.

ఇక ఈ స్కీమ్ వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ లో చేరితే రక్షణ, పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. అలానే మంచి రాబడి పొందొచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే ఐదేళ్ల చొప్పున టెన్యూర్ పెంచుకోవచ్చు.

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ స్కీ్మ్‌పై 7.1 శాతం వడ్డీ వస్తోంది. ఈ స్కీమ్ లో కనుక మీరు రోజుకు రూ.150 పొదుపుతో అంటే నెలకు రూ.4500 పీపీఎఫ్‌లో పెట్టాలని అనుకుని.. 20 ఏళ్ల వరకు పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే.. మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ.24 లక్షలు పొందొచ్చు.