PPF: వాటే స్కీమ్… రూ.70 పొదుపుతో రూ.6 లక్షలు పొందండి..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ప్రజల కోసం ఇస్తోంది. అయితే ఆ స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF (పీపీఎఫ్ స్కీమ్) కూడా ఒకటి. అయితే ఈ స్కీమ్ గురించి అందరికీ తెలుసు. చాలా మంది ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి లాభాలని పొందుతున్నారు. ఈ స్కీమ్ లో ఏ రిస్క్ ఉండదు. ఏ రిస్క్ లేకుండా ప్రాఫిట్స్ పొందాలంటే ఈ స్కీమ్ చాలా బెస్ట్. అదే విధంగా ఈ స్కీమ్ తో పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా మనం పొందొచ్చు. మరి ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

డబ్బులు
డబ్బులు

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి మంచిగా లాభాలని పొందొచ్చు. పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే మెచ్యూరిటీ కాలాన్ని 5 ఏళ్లు మీరు ఎక్స్టెండ్ వెళ్లొచ్చు. ఇది ఇలా ఉంటే వడ్డీ రేట్లను పెంచొచ్చు. లేదంటే తగ్గించొచ్చు. లేకపోతే అలానే స్థిరంగా ఉండచ్చు.

ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ఈ స్కీమ్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చెయ్యడానికి అవకాశం వుంది. ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. అయితే సంవత్సరానికి రూ.1.5 లక్షలు దాటకూడదు. రోజుకి రూ.70 పొదుపు చేసి నెల చివరిలో రూ.2000 పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.6 లక్షలకు పైగా వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news