తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో మ‌రో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంద్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షలు కురిసే అవకాశాలున్నట్టు అధికారుల హెచ్చరించారు. అదే విధంగా క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెబుతున్నారు.

తెలంగాణ రాయలసీమ, ఆంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో కూడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.