బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్. రిజర్వు బ్యాంక్ తీపికబురు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇవి సెప్టెంబర్ నుంచి అమలు లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చెక్ బుక్ ద్వారా లావాదేవాలు జరిపే వాళ్ళకి కాస్త ఊరట లభిస్తుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… రిజర్వు బ్యాంక్ కొత్త రూల్స్ తీసుకు వస్తోంది. దీనికి ముఖ్య కారణం చెక్ ప్రాసెస్‌ను వేగవంతం చెయ్యాలనే. దేశంలోని అన్ని బ్రాంచులను చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) పరిధి లోకి తీసుకు రావడానికి రిజర్వ్ బ్యాంక్ రెడీ అవుతోంది.
ఈ నిర్ణయం తో కస్టమర్లకు బెనిఫిట్ కలుగుతుంది. ఇక సీటీఎస్ గురించి చూస్తే.. దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచుల్లోనూ సీటీఎస్ వ్యవస్థను 2021 సెప్టెంబర్ నుంచి అమలులోకి తీసుకువస్తామని ఆర్‌బీఐ తెలిపింది. దీనితో చెక్ చెల్లింపులు స్పీడ్ అవుతాయి. దీనికి సంబంధించి ఆర్‌బీఐ వచ్చే నెల రోజుల్లో కొత్త రూల్స్ తీసుకు రాబోతోంది.
ఇది ఇలా ఉండగా 2010 నుంచే సీటీఎస్ విధానం అమలులో ఉన్నా దేశంలో 1,50,000 బ్యాంక్ బ్రాంచుల్లో ఈ ఫెసిలిటీ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం దీనిని విస్తరించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇంకా 18 వేలకు పైగా బ్యాంక్ బ్రాంచుల్లో ఈ విధానం అమలులో లేదు. సెప్టెంబర్ కల్లా ఈ బ్యాంక్ బ్రాంచుల్లోనూ సీటీఎస్ విధానం అమలులోకి వస్తుంది. దీని మూలంగా చెక్ ట్రాన్సాక్షన్లు కూడా వేగంగానే సెటిల్ అవుతాయి.