తెలంగాణలో పార్టీ పెట్టే ఉద్దేశ్యమే మాకు లేదు.. సజ్జల రామక్రిష్ణారెడ్డి.

Join Our Community
follow manalokam on social media

వైయస్ షర్మిల పార్టీ పెడుతున్నారని వస్తున్న వార్తలు ఒక్కసారిగా తెలంగాణలో విస్తృతంగా వ్యాపించాయి. మొన్న మొన్నటివరకు ఈ విషయమై పెద్ద చర్చ జరగకపోయినప్పటికీ, తాజాగా పార్టీ విషయమై పెద్ద చర్చే నడుస్తుంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంపై చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అటు అన్న వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటనేది అందరికీ ఆసక్తిగా మారింది.

ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, కొన్ని కామెంట్లు చేసారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తే ఏపీలో ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతింటాయని, అందుకే అటు వైపు చూడలేదని, ఇప్పుడు షర్మిల గారు పెడుతున్న పార్టీకి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, షర్మిలతో విభేధాల్లేకపోయినా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపాడు. మరి తెలంగాణలో కొత్తగా వస్తున్న ఈ పార్టీ ఏ మేర ప్రజల్లోకి వెళ్ళగలదో చూడాలి.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...