ఖాతాదారులకు అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

-

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల అలర్ట్‌ చేసింది. ట్వీట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా 44 కోట్ల ఎస్‌బీఐ వినియోగదారులకు హెచ్చరించింది. ఈ సందర్భంగా వినియోగదారులను ఉద్దేశించి చెప్పిను సూచనల్లో ‘ఖాతాదారులు ఎవరైన వారు చేయని యూపీఐ పేమెంట్‌కు డబ్బు డెబిట్‌ చేయమని ఎస్‌ఎంఎస్‌ వస్తే, అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు పేర్కొంది. ఈ సూచనలను పాటించి, మీ డబ్బు పట్ల జాగ్రత్తలు పాటించండి అని తెలిపింది. అలా ఎస్‌ఎంఎస్‌ వస్తే మొదట యూపీఐ సేవను ఆపండి, లేకపోతే విషయాన్ని సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి, ఆన్‌లైన్‌ మోసాలు, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తోందని వివరించింది.

అంతకు ముందు బ్యాంకు రుణాలు తీసుకొని మోసపోయే కస్టమర్లకు కూడా హెచ్చరించింది. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేని పేపర్‌ లెస్‌ లోన్‌ సౌలభ్యం వంటి మెసేజ్‌లు , రెండు నిమిషాల్లో మీకు రుణం ఇస్తామని తరుచుగా వచ్చే మెసేజ్‌లతో ప్రజలు రుణాలు తీసుకుంటారు. కానీ, అవి భారీ వడ్డి రేట్లను విధిస్తాయని తెలిపింది.

యూపీఐ సేవలను నిలిపివేసే విధానం

యూపీఐ సేవలను నిలిపివేయడానికి బ్యాంక్‌ కొన్ని చిట్కాలను పాటించమంది. టోల్‌ఫ్రీ నంబర్‌ 1800111109 కు కాల్‌ చేయడం ద్వారా వినియోగదారులు సేవలను నిలిపివేయవచ్చు. లేదా ఐవీఆర్‌ నంబర్‌ ద్వారా 18004253800/1800112211 కు కాల్‌ చేయవచ్చు. అలాగే 9223008333 ఎస్‌ఎంఎస్‌ పంపవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news