కేటీఆర్ అంటే ఎవరు? కేసీఆర్ కొడుకా : షర్మిల షాకింగ్ కామెంట్స్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పై వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అంటే ఎవరు? కేసీఆర్ గారి కొడుకా.. అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్‌ షర్మిల. కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదని… కేటీఆర్ కు అంతేనని ఫైర్‌ అయ్యారు. కేటీఆర్ దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో వంటలు చేసుకోవాలా? వ్రతాలు చేసుకోవాలా? అంటూ ప్రశ్నించారు.

కేటీఆర్ పెద్ద మొగోడు కదా మహిళలు, నిరుద్యోగులకు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో 3.85 వేల ఖాళీలను భర్తీ చేయాలని…అలా చేస్తే.. పెద్ద మొగోడు సాధించాడు అనుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ స్థాపించామని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

సీఎం అంటే సీఎం కాదని.. కామన్ మ్యాన్ తోనే సమానమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి అవునా, కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాలని… విద్యార్థులకు ఫీజురీయంబర్స్ మెంట్ చేశారని…దీని వల్ల ఎంతో మందికి మేలు జరిగిందన్నా స్పష్టం చేశారు. వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాదని… ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేశారు వైఎస్‌ షర్మిల. యుపిఎ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు పై పెట్టారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news