ఎస్బీఐ కస్టమర్స్ ఇంట్లో వుండే ఏటీఎం కార్డు పొందొచ్చు..!

ఏటీఎం కార్డు ఉంటే పనులు ఈజీగా అవుతాయి. అలానే మనకి నచ్చినప్పుడు మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే మీకు ఎస్బీఐ ఎకౌంట్ ఉంటే ఇలా ఈజీగా ఇంట్లో నుండే ఏటీఎం కార్డు పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

sbi | ఎస్‌బీఐ
sbi | ఎస్‌బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో ప్రయోజనాలని ఇస్తోంది. అలానే మంచి సర్వీస్ ని కూడా ఇస్తోంది. కొత్త డెబిట్ కార్డు పొందాలని భావిస్తున్నారా? అయితే మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే కొత్త డెబిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు అని స్టేట్ బ్యాంక్ అంటోంది. అయితే ఎలా పొందాలి అనేది చూస్తే… స్టేట్ బ్యాంక్ నుండి డెబిట్ కార్డు పొందాలని అనుకుంటే ఈజీగా ఎస్‌బీఐ యోనో ద్వారా మీరు ఈ కార్డుని పొందొచ్చు.

అయితే ఎస్‌బీఐ కస్టమర్లు యోనో యాప్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, అకౌంట్ స్టేట్‌మెంట్, చెక్ బుక్ ఆర్డర్, చెక్ పేమెంట్ క్యాన్సల్ మొదలైనవి చెయ్యచ్చు అన్న సంగతి తెలిసిందే. అదే విధంగా కొత్త ఏటీఎం కార్డు కోసం కూడా అప్లై చేసుకో వచ్చు అని ఎస్బీఐ అంది. దీని కోసం మీరు యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. దానిని ఓపెన్ చేసాక బ్లాక్ ఏటీఎం/డెబిట్ కార్డు‌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు అకౌంట్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు కార్డు నెంబర్ ఎంచుకొని పాత కార్డుని ఉంటే కారణం చెప్ప బ్లాక్ చేసి కొత్త దానిని పొందొచ్చు. ఇలా ఇంట్లో వుండే కొత్త కార్డు పొందొచ్చు.