SBI: హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్…!

-

మీరు సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలి అని అనుకుంటున్నారా…? లోన్ తీసుకోవాలన్నా ప్లాన్ లో ఉన్నారా…? అయితే ఇది మీకు మంచి వార్త అనే అనాలి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చౌక వడ్డీకే రుణాలు అందిస్తోంది పైగా ప్రాసెసింగ్ ఫీజు కూడా మినహాయిస్తోంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అందిస్తున్న ఈ సేవ గురించి పూర్తి వివరాలని ఇప్పుడే తెలుసుకోండి.

పూర్తి వివరాల లోకి వెళితే… SBI రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. దీనితో లోన్ తీసుకునే వారికి కాస్త ఊరట కలుగనుంది. ఇది అందరికీ వర్తించదు కాస్త గమనించండి. ఎవరకి వర్తించదు అనే విషయానికి వస్తే… హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు మాత్రమే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంటుందని SBI తెలిపింది.

ఇది ఇలా ఉండగా మార్చి 31 వరకు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించక్కర్లేదు. ఇది మాత్రమే కాదు బ్యాంక్ నుంచి చౌక వడ్డీకే రుణాలు తీసుకోవచ్చు అని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.8 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఎస్‌బీఐ.. హోమ్ లోన్స్ మార్కెట్‌లో 34 శాతం వాటాతో సాగుతోంది. రోజుకు సగటున దాదాపు 1,000 మందికి ఎస్‌బీఐ హోమ్ లోన్స్ అందిస్తోందట.

Read more RELATED
Recommended to you

Latest news