రిటైర్ మెంట్ తర్వాత ఏ పార్టీలో చేరను.. గులాం నబీ ఆజాద్.

-

రాజ్యసభ సబ్యుడు గులాఅం నబీ ఆజాద్ రిటైర్ అవబోతున్నారు. మరికొద్ది రోజుల్లో తన పదవీ కాలానికి ముగింపు పలకబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభలో ఉన్న ఆజాద్ గారు ఎన్నో పదవులు చేపట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు. ఎన్నో పదవులు చేపట్టి ప్రస్తుతం రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పాలని అనుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ అవబోతున్న తరుణంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

నేనిప్పుడు ఎక్కడైకైనా వెళ్ళవచ్చు. ప్రజలతో కలిసి పనిచేయడానికి, వారితో కలిసి స్వేఛ్ఛగా ఉండేందుకు, వారికి సేవ చేయడానికి ఎక్కడికైనా వెళ్తానని, నా ఊపిరి ఉన్నంత వరకూ ప్రజల్లోనే జీవిస్తానని, ప్రజల కొరకు ఏం చేయడానికైన సిద్ధంగా ఉంటానని అన్నారు. రిటైర్ అయ్యాక ఏ పార్టీలో ఉండనని, ఎలాంటి పదవి స్వీకరించనని, ప్రజల కోసమే ఉంటానని మాటిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో గులాం నబీ ఆజాద్ గారు కూడా ఒకరు.

Read more RELATED
Recommended to you

Latest news