పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్ళకి SBI లోన్…!

-

మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా..? పైగా మీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు ఎస్బీఐ నుండి గుడ్ న్యూస్. మీకు ఒక ఆప్షన్ అందుబాటు లో ఉంది. ఎస్‌బీఐ నుంచి సులభం గానే రుణం తీసుకోవచ్చు.

పెళ్లి చేసుకోవాలంటే భారీ మొత్తం లో డబ్బులు కావాలి. పైగా మళ్ళీ తిరిగి రావు. పైగా ఈతరం అంతా కూడా పెళ్లిని ఎంతో బాగా చేసుకోవాలని.. నచ్చిన ప్రదేశాల్లో చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మరి కొందరు అయితే డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకోవాలని అనుకుంటున్నారు. దీనికి బాగా డిమాండ్ పెరిగిపోయింది.

అయితే ఇలా గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించే వారికి దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఒక ఆప్షన్ అందిస్తోంది. దీనితో మీకు లోన్ కూడా వస్తుంది. పెళ్లి చేసుకోవాలని భావించే వారు ఎస్‌బీఐ నుంచి లోన్ పొందొచ్చు.

చౌక వడ్డీకే లోన్ ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతోంది. యోనో యాప్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఋణం వస్తుంది. కాబట్టి ఇలా ఈజీగా లోన్ పెట్టుకుని వచ్చిన డబ్బు తో మీరు అనుకున్నట్టుగా వివాహం చేసుకోండి. మీకు నచ్చిన చోట వివాహం చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news