బ్యాంక్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, మ్యూచువల్ ఫండ్స్…. వీటిలో ముందు డబ్బులు దేనిలో రెట్టింపు అవుతాయంటే..?

-

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బులని ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసి మంచిగా లాభాలని పొందాలని అనుకుంటారు. అయితే మీరు కూడా ఏదైనా మంచి దానిలో మీ డబ్బుల్ని పెట్టి అదిరే లాభాలని పొందాలని అనుకుంటున్నారా..? దీర్ఘకాల లక్ష్యం కోసం ఇప్పటి నుంచే చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేయాలని భావిస్తున్నారా..? అయితే తప్పక మీరు దీని కోసం తెలుసుకోవాలి. డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ ఇన్వెస్ట్ చెయ్యడమే కరెక్ట్.

 

money
money

అందుకనే ఈ విషయం తెలుసుకోండి. ఇక పూర్తి వివరాలని చూస్తే.. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఇలా ఎన్నో అవకాశాలు మనకి ఉంటాయి. ఎవరికి నచ్చిన వాటిలో వాళ్ళు డబ్బులు పెట్టి లాభాలని పొందొచ్చు. అయితే ఎందులో పెడితే తొందరగా డబ్బులు డబుల్ అవుతాయో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేస్తూ వుంటారు. అయితే ఎఫ్‌డీలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. 72 రూల్ ప్రకారం చూస్తే.. బ్యాంక్‌లో ఎఫ్‌డీ FD తెరిస్తే మీ డబ్బులు రెట్టింపు అవ్వడానికి దాదాపు 13 ఏళ్లు పడుతుంది. అదే పీపీఎఫ్‌లో PPF అయితే డబ్బులు డబుల్ అవ్వడానికి 10 ఏళ్లు పడుతుంది. ఇక వడ్డీ రేటు చూస్తే.. పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.

ఇది ఇలా ఉంటే సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెడితే డబ్బులు రెట్టింపు అవ్వడానికి 9.4 ఏళ్లు పడుతుంది. సుకన్య స్కీమ్‌లో వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో 10 శాతం వరకు రాబడి పొందొచ్చు. అంటే అన్నింటి కంటే త్వరగా ఇందులోనే డబ్బులు రెట్టింపు అవుతాయి. కానీ కాస్త రిస్క్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news